తెలుగు కళా సమితి, విశాఖపట్నం 2017 సంవత్సరంలో యెళ్ళుమహంతి సత్య కూర్మ నరసింహ స్వామి గారిచే స్థాపించబడింది. వీరు 19-08-1954న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, శృంగవరపుకోటలో జన్మించారు. వీరి తండ్రి యెళ్ళుమహంతి వెంకట రమణ గారు, తల్లి యెళ్ళుమహంతి సూర్యకాంతం గారు.
వీరు కువైట్‌లో ఆయిల్ & గ్యాస్ సంస్థలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన సమయంలో తెలుగు కళా సమితి, కువైట్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని విశేష సేవలు అందించారు. అంతకు ముందు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో స్వయంసేవక్‌గా సేవలు అందించారు. విశాఖపట్నం, విజయనగరం, శృంగవరపుకోట ప్రాంతాలలో అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. “దివిసీమ ఉప్పెన” సమయంలో కూడా సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
పదవీ విరమణ అనంతరం 2017లో భారతదేశానికి తిరిగి వచ్చి, సామాజిక నాటక రచయితలు మరియు రచయితల అభివృద్ధి కోసం తెలుగు కళా సమితి, విశాఖపట్నం స్థాపించారు.
ఈ సంస్థ తెలుగు సాహిత్యాభివృద్ధి మరియు సమాజ సేవ అనే రెండు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతోంది.
